కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకోని మాట్లాడాలి : ఈటల జమున

by  |
Eatala Jamuna
X

దిశ ప్రతినిధి, మేడ్చల్/శామీర్ పేట : కలెక్టర్లు టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని మాట్లాడాలని జమున హ్యాచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఈటల జమున ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ అసైన్డ్ భూములను కబ్జా చేసింది నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ మేరకు హ్యాచరీస్ ఎండీ ఈటల జమున శామీర్ పేటలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

మెదక్ జిల్లా కలెక్టర్ జమున హ్యాచరీస్ గురించి ప్రెస్ మీట్ పెట్టారని, కలెక్టర్ ఏ అధికారంతో ప్రెస్ మీట్ పెట్టారని ప్రశ్నించారు. భూములన్నీ కోర్ట్‌లో ఉన్నాయని, అంతేకాకుండా ఇవన్నీ ధరణి పోర్టల్‌లో ఎక్కించిన సంవత్సరం తరువాత తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. గౌరవమైన పదవిలో ఉండి ఈ విధంగా టీఆర్ఎస్‌కు కొమ్ముకాసే విధంగా వ్యవహరించడం సరికాదని కలెక్టర్‌పై మండి పడ్డారు. 56 మంది భూములను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని, హాకీంపేట, అచ్చంపేట పరిధిలో 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని సర్వేలో వెల్లడయిందని కలెక్టర్ అన్నారని, జమున హ్యాచరీస్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసిందని కలెక్టర్ చెప్పడం శోచనీయం అన్నారు. జమున హ్యాచరీస్ సంస్థ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో చెట్లను నరికి రోడ్లు వేసిందని కలెక్టర్ చెప్పటం సరికాదని, అన్యాయంగా వ్యవహరిస్తున్న కలెక్టర్, ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడుతామని తెలిపారు.

మహిళా సాధికారిత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి తనను మానసికంగా హింసించటం ఎంతవరకు సబబు కాదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను భవిష్యత్తులో ఎదుర్కోవటానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యాపారాల మీద దెబ్బ కొడ్తున్నారని ఆరోపించారు.

ఇక మీదట 33 జిల్లాల్లో ఈటల రాజేందర్ పర్యటిస్తారని, ఎదుర్కోవటానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత భూములను అమ్ముకున్నాం. మా గెలుపును ఓర్వలేక
ఈటల రాజేందర్ రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కలెక్టర్లు టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుంని సలహా ఇచ్చారు. సర్వే నెంబర్ 8లో మాకు ఉన్నది 5 ఎకరాల 30 గుంటలే.. సర్వే నెంబర్ 130లో మూడు ఎకరాలు ఉందని, కానీ కలెక్టర్ మాత్రం 70 ఎకరాలు ఆక్రమించారని చెప్పడం వడ్డూరంగా ఉన్నందన్నారు. 70 ఎకరాలు ఆక్రమించుకున్నామంటోన్న కలెక్టర్ పై కచ్చితంగా కేసులు పెడతాని చెప్పారు.

మా వ్యాపారాలకు అనుమతులు ఇవ్వదొద్దని పెద్దలు చెప్పిన్లటు అధికారులే చెబుతున్నారని, చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఒకలా.. బయటకు వచ్చాక మరొకలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మా భూముల్లో పెద్ద షెడ్డులు వేసుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. భూములకు సంబంధించిన అంశం కోర్ట్ పరిధిలో ఉందన్నారు. మాకు ఎటువంటి వివరాలు ఇవ్వకుండా. .ప్రెస్ మీట్ ఎలా పెడుతారని కలెక్టర్‌ను నిలదీశారు. కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టడానికే ఉన్నారా…? అని ప్రశ్నించారు. ధరణిలో ఎంట్రీ అయిన భూములను కొనుగోలు చేసి, లాయర్ ద్వారా లీగల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, ధరణిలో ఉన్న భూములన్ని ఫేకేనా..? అని జమున నిలదీశారు.

Next Story