లైక్స్ కోసం బాత్రూంలో వీడియో.. పోయిన ప్రాణం

by  |
లైక్స్ కోసం బాత్రూంలో వీడియో.. పోయిన ప్రాణం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం యువత సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతుంది. యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు, ట్విట్టర్ లో వైరల్ వీడియోలు అంటూ లైక్స్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ షాంపూ వాడితే జుట్టు పెరుగుతుంది.. ఇంట్లోనే ఉంటూ హెయిర్ రెమిడీస్ చేయడం ఎలా? అంటూ ఏవేవో వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. తాజాగా ఇలాగే ఒక ప్రయోగాత్మకమైన వీడియో ఒక 12 ఏళ్ళ కుర్రాడి ప్రాణం తీసింది.

వివరాలలోకి వెళితే కేరళ లోని తిరువనంతపురానికి చెందిన శరవణన్ అనే కుర్రాడు 7 వ తరగతి చదువుతున్నాడు. సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిన శరవణన్ లైక్స్ కోసం చిన్న చిన్న వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈసారి ఎక్కువ లైక్స్ సాధించాలని చెప్పి స్పిరిట్ తో హెయిర్ స్ట్రయిటినింగ్ ఎలా చేయాలో ఒక వీడియో తీద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంట్లో ఎవరు లేని సమయంలో బాత్ రూమ్ కి వెళ్లి తలకు కిరోసిన్ రాసుకొని అగ్గిపుల్లతో అంటించుకున్నాడు. అయితే కిరోసిన్ మంట ఎక్కువగా రావడంతో కుర్రాడు అక్కడిక్కడే తగులబడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శరవణన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed