అరటి పళ్ళు అమ్మడానికి ఆ వ్యాపారి చేసిన పని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

by  |
అరటి పళ్ళు అమ్మడానికి ఆ వ్యాపారి చేసిన పని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: అతనో అరటి పళ్ళ వ్యాపారి.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన తోపుడు బండి పై అరటి పళ్ళను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే అతనికి బతుకుదెరువు…. కానీ అంతలోనే అనుకోని ఒక సమస్య. దీంతో అతను ఒక పెద్ద వ్యాపార వేత్తగా మారిపోయాడు. ఒక రియాల్టర్ లా వేలం పాటలో స్థలం కొనడానికి రెడీ అయిపోయాడు. ఒక పండ్ల వ్యాపారి స్థలం కొనడమేంటి? అనుకుంటున్నారా? అవునండి అరటి పళ్ళను అమ్ముకోవడానికి అతను ఏకంగా కోటి రూపాయలు పెట్టి స్థలాన్ని కొనుగోలు చేసాడు. ఎవరా చిరు వ్యాపారి అంటే నెల్లూరు కు చెందిన జిలాని.

నెల్లూరు జిల్లాలోని బుచ్చిపాలెం కు చెందిన ఎస్ కే జిలాని ఎన్నో ఏళ్ళ నుండి ముంబై జాతీయ రహదారికి ఆనుకుని, బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద అరటి పళ్ళను అమ్ముతున్నాడు. అయితే ఇటీవల ఆ ప్రాంతాల్లో ఉన్న షాపులను తీసివేసి కొత్త కాంప్లెక్స్ లను కట్టడానికి నిర్వాహకులు భావించారు. దీంతో ఎక్కడ తన బతుకుదెరువు పోతుందోనని భయపడిన జిలాని ఏకంగా కోటి ఇరవై లక్షలు పెట్టి 108 చదరపు అడుగుల స్థలాన్ని వేలంపాటలో కొనేసాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ కి గురయ్యారు. ఒక సాధారణ పండ్ల వ్యాపారి వ్యాపారవేత్తల మరీ తన జీవనాధారాన్ని కాపాడుకోవడం కోసం కోట్లను ఖర్చు పెట్టాడు అంటూ అందరు ఆశ్చర్యపోతున్నారు.

Next Story

Most Viewed