వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ధర్నా

by  |
child
X

దిశ, ఉప్పల్ ; కాప్రా సర్కిల్ ఏఎస్ రావునగర్ లోని అంకుర చిల్డన్స్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కీసర మండలం దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన మదుసూధన్, అమూల్య దంపతుల నాలుగు నెలల చిన్నారి హివంశిక ఊపీరి సమస్యతో బుధవారం సాయంత్రం ఏఎస్ రావునగర్ లోని అంకుర చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించుకుని ఫీజులు కట్టించుకున్నారు. గురువారం ఉదయం చిన్నారి మృతి చెందింది. అయితే అసలు వైద్య సేవలు అందించడంలో వైద్యలు నిర్లక్ష్యం చేయడంతో చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ధ ఆందోళన నిర్వహించారు.

ఫీజుల వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ వైద్యం అందించడంలో లేదనీ, వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. ఇందుకు కారణమైన ఆసుపత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బంధువులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడి ఆసుపత్రిలో గడిచిన నెల రోజుల్లోనే రెండు చొటుచేసుకున్నాయని, వెంటనే ఆస్పత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed