మతం ఆధారంగా కాదు.. ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా రిజర్వేషన్ ఇచ్చాం: జైరాం రమేష్

by Harish |
మతం ఆధారంగా కాదు.. ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా రిజర్వేషన్ ఇచ్చాం: జైరాం రమేష్
X

దిశ, నేషనల్ బ్యూరో: సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో కొన్ని మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించామని, కానీ మతం ఆధారంగా కాదని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఆదివారం అన్నారు. బీపీసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన రాజ్యాంగం ప్రకారం, మతం ఆధారంగా రిజర్వేషన్, పౌరసత్వం ఇవ్వడానికి అనుమతి ఉండదు, అలాంటిది మేము రాజ్యాంగాన్ని ఉల్లింఘించి మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వలేదు. కానీ బీజేపీ మాత్రం సీఏఏ ద్వారా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మతపరమైన మార్గాల్లో పౌరసత్వం ఇవ్వాలని చూస్తుంది. అందుకే సీఏఏ చట్టాన్ని కోర్టులో సవాల్ చేశారని రమేశ్‌ అన్నారు.

ముస్లింల ఓటు బ్యాంకును పొందడానికి ఓబీసీలు, దళితులకు కేటాయించాల్సిన కోటాను కాంగ్రెస్‌ లాక్కుంటోందని, వాటిని పక్కదారి పట్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా కాంగ్రెస్ నేత జైరామ్‌ రమేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ ఆవిర్భావం నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని రమేశ్‌ చెప్పారు.

కాంగ్రెస్ ఎల్లప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎప్పటికీ కృషి చేస్తుందని అన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని రద్దు చేయడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి అటువంటి చర్యకు అనుకూలంగా ఉన్నారో లేదో వెల్లడించాలని కోరుతున్నామని రమేష్ అన్నారు. మాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా బీజేపీ బలం పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో సగానికి తగ్గిపోతుందని, దక్షిణాదిలో అది తుడిచిపెట్టుకుపోతుందని చెప్పగలమని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ పేర్కొన్నారు.



Next Story

Most Viewed