నిర్మాణం జరుగుతున్న భవనంలో మృతదేహాలు

by Sridhar Babu |
నిర్మాణం జరుగుతున్న భవనంలో మృతదేహాలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని న్యూ వీక్లీ మార్కెట్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో గుర్తు తెలియని మహిళ, బాలుడి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ సంఘటన అదివారం వెలుగు లోకి వచ్చింది. మహిళ వయస్సు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండగా, బాలుడి వయస్సు 6 నుంచి 8 సంవత్సరాలు ఉంటుందని

పోలీస్ లు అంచనా వేస్తున్నారు. రెండు మృతదేహాలను గుర్తించిన బాన్సువాడ పోలీసులు అవి పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఈ విషయం బహిర్గతమైంది. ఉమ్మడి జిల్లాలో మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు. స్థానికంగా సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. చనిపోయిన వారు తల్లీ కుమారుడు కావచ్చు అని పోలీస్ లు భావిస్తున్నారు.

Next Story