రైతు కూలీలకు జగన్ సర్కార్ తీపి కబురు

by  |
రైతు కూలీలకు జగన్ సర్కార్ తీపి కబురు
X

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని అమరావతి ప్రాంత పేద ప్రజలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అమరావతి ప్రాంతంలో భూమి లేని కుటుంబాలకు పెన్షన్లు చెల్లించేందుకు రూ.30 కోట్లు విడుదలకు.. జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించి రూ. 30 కోట్ల మొత్తాన్ని పెన్షన్లుగా చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ఈ పెన్షన్ డబ్బును జమ చేయాలని అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌ను రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. రెండు మూడు రోజుల్లో రాజధాని ప్రాంత ప్రజల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ కానున్నాయి. ఇదిలా ఉంటే అమరావతి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పరిహార భృతిని జగన్ ప్రభుత్వం రూ. 2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. దీనివల్ల అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 20,100 మంది భూమి లేని కూలీలకు లబ్ధి చేకూరనుంది.

Next Story

Most Viewed