గుండాల సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత

by  |
గుండాల సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత
X

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల సహకార చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన చెరో ఆరుగురు అభ్యర్థులు సాధారణంగా ఓటింగ్‌లో పాల్గొనగా.. 13వ వార్డు సభ్యుడైన చిన్నఐలయ్యను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి స్వయంగా తన కారులో ఎక్కించుకుని వచ్చి ఓటు వేయించాడు. ఆ తర్వాత అదే కారులో తీసుకెళ్లాడు. దీంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కోమటిరెడ్డి డౌన్ డౌన్ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ.. సహకార బ్యాంకు కార్యాలయం నుంచి బయటకొచ్చారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చి టీఆర్ఎస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా నినాదించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Next Story

Most Viewed