కారు బోల్తా పడే ఛాన్స్.. చూసి నడుపాలంటున్న కేసీఆర్?

by  |
cm-and-car1
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్​వెలువడిన విషయం తెలిసిందే. నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాల నుంచి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ లో కసిరెడ్డి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి విజయం సాధించారు. మిగిలిన ఆరు స్థానాలకు పోలింగ్​జరుగనుంది. అధికార పార్టీతో సహా కాంగ్రెస్ అభ్యర్థులు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. వారు ఉపసంహరణకు నిరాకరించడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో టెన్షన్ పట్టుకుంది. స్వతంత్రులకు కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇతర పార్టీల ఓటర్లు (స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు) పరోక్షంగా మద్దతు ప్రకటిస్తుండటం ఉత్కంఠ రేపుతున్నది. ఇదిలా ఉండగా ఆయా జిల్లాల్లోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లను టూర్లకు తరలించారు.

ఏకగ్రీవాల పర్వం

నామినేషన్ల ఉపసంహరణ అనంతరం.. వరంగల్, మహబూబ్ నగర్ స్థానాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే పోటీలో నిలిచారు. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. వరంగల్ జిల్లాలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ లో కసిరెడ్డి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పోటీ అనివార్యమైంది. ఈ జిల్లాల్లో నామినేషన్లు వేసిన ఇండిపెండెంట్లలో ఎక్కువ మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే ఉండటం గమనార్హం.

కాంగ్రెస్, బీజేపీల పరోక్ష మద్దతు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ నేతలే స్వతంత్రులుగా బరిలో దిగారు. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ బరిలో నిలిచినప్పటికీ మిగతా స్థానాల్లో ఇండిపెండెంట్లకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నది. దీనికి తోడు బీజేపీకి చెందిన స్థానిక సంస్థల సభ్యులు సైతం టీఆర్ఎస్ నుంచి రెబల్ గా బరిలో దిగిన వారికి మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. వీరికి టీఆర్ఎస్ లోని కొందరు సభ్యులు మద్దతు ఇస్తుండటంతో పోటీకి ససేమిరా అంటున్నట్టు తెలిసింది. తమను ముఖ్య నేతలు పట్టించుకోకపోవడంతోనే బరిలో దిగామని పలువురు చెప్తుండటం గమనార్హం.

అంతటా పోటీ రసవత్తరం

అధికార పార్టీకి సొంత పార్టీ నేతల నుంచే తలనొప్పి మొదలైంది. ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన సారంగాపూర్ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, కడెం జెడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుల ప్రతిపాదనతో నామినేషన్ వేయగా, కుంటాల ఎంపీపీ గజ్జారాం (కాంగ్రెస్) ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం చర్చకు దారితీసింది. ఖమ్మంలో ఎంపీటీసీల సంఘం నుంచి కొండపల్లి శ్రీనివాస్ రావు (టీఆర్ఎస్), స్వతంత్ర అభ్యర్థిగా కొండ్రు సుధ బరిలో నిలిచారు. వీరి నామినేషన్ కు టీఆర్ఎస్ పార్టీలోని ఎంపీటీసీ సభ్యులే ప్రతిపాదించడం విశేషం. దీంతో ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. నల్లగొండలో సైతం కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు జెడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీటీసీలు (ఇండిపెండెంట్లుగా) పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మెదక్ లో సైతం టీఆర్ఎస్ కు చెందిన ఒక ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కరీంనగర్ లో టీఆర్ఎస్ కు చెందిన రవీందర్ సింగ్ నామినేషన్ వేయడంతో అధికార పార్టీకి మింగుడుపడటం లేదు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సభ్యులను క్యాంపునకు తరలించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 24 మంది బరిలో ఉండటం, వారిలో ఇద్దరు అధికారపార్టీకి చెందిన వారున్నారు. మిగతా 22 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. దీంతో అత్యధికులు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే కావడంతో ఇక్కడా ఆ పార్టీకి తలనొప్పి తప్పలేదు. వీరికి ప్రతిపక్ష పార్టీలు సైతం సహకరిస్తుండటంతో ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి నెలకొంది.

కారుకు టీఆర్ఎస్ సీనియర్ల బ్రేకులు


Next Story

Most Viewed