నిజామాబాద్‌లో మరో 10 పాజిటివ్ కేసులు

by  |
నిజామాబాద్‌లో మరో 10 పాజిటివ్ కేసులు
X

దిశ, నిజామాబాద్: జిల్లాలో కొత్తగా మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 21మంది రిపోర్ట్‌లు రాగా, వీరిలో 10 మందికి పాజిటివ్‌, 11 మందికి నెగటివ్‌గా వచ్చాయన్నారు. తాజా కేసులతో కలిపి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 39కి చేరిందని వివరించారు. ఈ మహమ్మారి విస్తృతిని అడ్డుకోవడానికి పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో 15 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామనీ, వీటిల్లో నిజామాబాద్‌, బోధన్‌లలో 4 చొప్పున, బాల్కొండలో 2, రెంజల్, మోస్రా, ఆర్మూర్, భీంగల్, నందిపేట్‌లలో ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో పాజిటివ్ వచ్చిన ఇళ్లకు కిలోమీటర్ వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రతి వంద కుటుంబాలకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామనీ, మొబైల్ వాహనాల ద్వారా ఇంటికే కూరగాయలు, కిరాణా సామాన్లు అందజేస్తామని వెల్లడించారు. అయితే, ఇంకా 109 రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయని వాటిలో ఎన్ని పాజిటివ్ కేసులు వస్తాయో చెప్పలేమనీ, అయినప్పటికీ జిల్లా యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ, తదితరులు పాల్గొన్నారు.

tags: corona cases in nizamabad, corona, nizamabad, vemula prashanth reddy, collector narayana redd, cp karthikeya, clustors,



Next Story

Most Viewed