పొగ మంచు.. మళ్లీ పడిపోతున్నఉష్ణోగ్రతలు!

by  |
పొగ మంచు.. మళ్లీ పడిపోతున్నఉష్ణోగ్రతలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చలి మళ్లీ విజృంభిస్తోంది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గు‌తు‌న్నా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. బుధ‌వారం అత్యల్పంగా ఆది‌లా‌బాద్‌ జిల్లా అర్లి(‌టీ)లో 7 డిగ్రీలు, కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌ జిల్లా గిన్నె‌ధ‌రిలో 7.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమో‌ద‌య్యాయి. ఆది‌లా‌బాద్‌, కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, నిర్మల్‌, సంగా‌రెడ్డి, కామా‌రెడ్డి, మంచి‌ర్యాల జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 నుంచి 9.2 డిగ్రీల వరకు రికార్డయినట్లు తెలం‌గాణ స్టేట్‌ డెవ‌ల‌ప్‌‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలి‌పింది.

ఈశాన్య గాలులతో ఉష్ణోగ్రతలు పడి‌పో‌వ‌డం‌తో‌పాటు పలుచోట్ల పొగ‌మంచు కమ్ముకుంటోంది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండ‌లం‌ యనం‌ బై‌లులో 35.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. హైదరాబాద్‌లోనూ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్​ ప్రాంతాల్లో 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Next Story

Most Viewed