'మీ భ‌ర్త‌ను చంప‌డం ఎలా?' పుస్త‌కం రాసింది. భ‌ర్త‌ని నిజంగానే..?!

by Disha Web Desk 20 |
మీ భ‌ర్త‌ను చంప‌డం ఎలా? పుస్త‌కం రాసింది. భ‌ర్త‌ని నిజంగానే..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కొంద‌రు చాలా క‌చ్ఛితంగా ఉంటారు. ఏది చెబుతారో అదే చేస్తారు! అయితే, మ‌రీ ఇంత దారుణంగా మాత్రం కాదు.. ఒకప్పుడు "హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ (మీ భ‌ర్త‌ను చంప‌డం ఎలా?)" అనే శీర్షికతో వ్యాసం రాసిన ఓ 'రొమాన్స్‌' నవలా రచయిత్రి తన భర్తను తానే హత్య చేసిన ఘ‌ట‌న లేటుగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం కోర్టు విచార‌ణ ఎదుర్కుంటున్న అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన నాన్సీ క్రాంప్టన్-బ్రోఫీ (71), 2011లో "హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్" వ్యాసం రాసింది. జీవిత భాగస్వామిని చంపడానికి ఉండాల్సిన ఉద్దేశాలు, చంప‌డంలో అనేక మార్గాలను ఉటంకిస్తూ ఈ వ్యాసం రాసింది. అయితే, కొన్నాళ్లుకు త‌న భ‌ర్త జీవిత బీమా ద్వారా వ‌చ్చే 1.5 మిలియన్లకు పైగా డాల‌ర్ల కోసం జూన్ 2018లో భర్త డేనియల్ బ్రోఫీని కాల్చి చంపింద‌ని ఆమెపైన‌ ఆరోపణలు వచ్చాయి. 2 జూన్ 2018న పోర్ట్‌ల్యాండ్‌లోని ఒరెగాన్ క్యులినరీ ఇనిస్టిట్యూట్ (OCI)లోని వంటగదిలో బ్రోఫీ చనిపోయినట్లు ఆయ‌న స‌హోద్యోగి పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా హ‌త్య కేసు న‌మోద‌య్యింది.

హత్య సమయంలో బ్రోఫీ పనిచేసిన పోర్ట్‌ల్యాండ్‌లో నిందితురాలు నాన్సీ ఉన్నట్లు ద‌ర్యాప్తు అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే నాన్సీ మాత్రం ఆ రోజంతా ఇంటి నుండి బ‌య‌ట‌కే వెళ్ల‌లేద‌ని అధికారులకు అబద్ధం చెప్పింది. కానీ, హ‌త్య‌ జరిగిన మరుసటి రోజే రచయిత నాన్సీ తన భర్త మరణ వార్తను ఫేస్‌బుక్‌లో పంచుకుంది. హ‌త్య విచార‌ణ‌లో భాగంగా ఆమెను సెప్టెంబర్ 2018లో అరెస్టు చేశారు. అయితే, ఆమెపై ఉన్న హ‌త్య‌, చ‌ట్ట‌విరుద్ధంగా తుపాకీ ఉప‌యోగించ‌డం వంటి ఆరోపణలు అబ‌ద్ధ‌మ‌ని నాన్సీ వాదిస్తోంది. ఈ హ‌త్య వెలుగులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి క‌రోనా ఆంక్ష‌ల కార‌ణంగా విచార‌ణ ఆల‌స్యం అయ్యింది. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది.



Next Story

Most Viewed