బంక్‌లో పెట్రోల్ కి బదులు నీళ్లు

by Disha Web |
బంక్‌లో పెట్రోల్ కి బదులు నీళ్లు
X

దిశ, ముధోల్: కుభిర్ మండల కేంద్రంలోని స్థానిక వివేకానంద చౌక్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ లో లీటర్ పెట్రోల్ లో దాదాపు సగం నీళ్లు, సగం పెట్రోల్ వేస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజుల నుండి పెట్రోల్‌లో నీళ్లు వస్తుందని పలువురు వాహనచోదకులు పేర్కొంటున్నారు. తాజాగా శనివారం మండలంలోని దార్ కుబీర్ గ్రామానికి చెందిన సుదర్శన్ అనే వాహనదారుడు వంద రూపాయల పెట్రోల్ పోయించాడు. పెట్రోల్ పోసినా బండి స్టార్ట్ అవ్వలేదు. దీంతో పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ లోకి బండి తీసుకువెళ్లారు. పెట్రోల్ లో నీళ్లు ఉన్నందువల్ల బైక్ స్టార్ట్ కావడం లేదని మెకానిక్ చెప్పడంతో.. బండి లో ఉన్న పెట్రోల్ ఒక బాటిల్లో తీసి పెట్రోల్ బంక్ లోకి తీసుకువచ్చారు. పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నించి, తరచూ పెట్రోల్ లో నీళ్ళు వస్తున్నాయని సిబ్బందికి తెలిపారు. దీనికి పెట్రోల్ బంక్ సిబ్బంది పెట్రోల్ ఇచ్చేయండి.. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని తెలిపారని వాహనచోదకుడు తెలిపాడు.

Next Story

Most Viewed