మిర్చికి ఆల్ టైం రికార్డ్ ధర.. ఎంతంటే..?

by Disha Web Desk 13 |
మిర్చికి ఆల్ టైం రికార్డ్ ధర.. ఎంతంటే..?
X

దిశ, వరంగల్ టౌన్: వరంగల్ ఏనుముల మార్కెట్లలో దేశీయ మిర్చికి కింటాకు రూ.40 వేలు పలికి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. పత్తి ధర రూ.10100 పలికింది. మంగళవారం ఉదయం మార్కెట్ కొనుగోలు దారులు కొంత ఆలస్యంగా మార్కెట్లో కొనుగోళ్లు జరిగాయి. అందులో రైతు సుధాకర్ రావు మిర్చి రైతు 11 బస్తాల మిర్చి తెచ్చాడు. తిరుపతి పత్తి రైతు 17 పత్తి బస్తాలు తెచ్చాడు. పంటలకు మంచి ధర పలకడం తో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణంగా బులియన్ మార్కెట్లో వచ్చిన కొద్దిపాటి వెసులుబాటుతో దేశ విదేశాలకు ఎగుమతులకు మంచి అవకాశం, డిమాండ్ లతో ఆడర్లు రావడం మిర్చికి మంచి రేటు పలికింది అంటున్నారు.. మార్కెట్ కొనుగోలు దారులు. మార్కెట్లో కొనుగోలు చేసిన మిర్చి, పత్తిని ఏరోజుకారోజు లారీల ద్వారా తరలిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయంగా మిర్చికి డిమాండ్ పెరిగిందని దాని కారణంగా మిర్చికి ధరలు పెరుగుతున్నయన్నారు.



Next Story

Most Viewed