భారత్‌లా ఎవ్వరూ చేయలేరు.. సీఎం యోగి వ్యాఖ్యలు

by Disha Web Desk 17 |
భారత్‌లా ఎవ్వరూ చేయలేరు.. సీఎం యోగి వ్యాఖ్యలు
X

లక్నో : భారత్ పట్టించుకున్నట్టు మరే దేశం తమ దేశ పౌరుల గురించి పట్టించుకోలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుని సురక్షితంగా లక్నోకు చేరుకున్న గోరఖ్‌పూర్‌ విద్యార్థులతో ఆయన గురువారం సంభాషించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ తమ గగనతలాన్ని మూసివేయగా భారత్ తమ పౌరులను తీసుకొచ్చేందుకు రొమేనియా, హంగరీ, స్లోవేకియా, పోలండ్‌ వంటి దేశాల సాయం తీసుకుంది. ఉక్రెయిన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల నుంచి 'ఆపరేషన్ గంగా మిషన్' పేరుతో భారతీయులను సురక్షితంగా ఎయిర్ లిప్ట్ చేసిందన్నారు. ఇతర దేశాలు తమ పౌరులను తరలించేందుకు ముందుకు రాలేదని ఒక్క భారత్‌ మాత్రమే విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలెట్టిన వెంటనే పౌరులను వెంటనే తీసుకొచ్చేందుకు మోదీ సమీక్ష నిర్వహించారని తెలిపారు. యూపీ ప్రభుత్వం కూడా విద్యార్థుల వివరాలను సేకరించి నోడల్‌ అధికారుల్ని నియమించినట్టు గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో మొత్తంగా 2,290 మంది యూపీ విద్యార్థులు ఉండగా ఇప్పటివరకు 2,078 మందిని తీసుకొచ్చాం. మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed