సబ్బుతో అవాంఛిత రోమాలు ఈజీగా తొలగించుకోవచ్చు..

by Disha Web Desk |
సబ్బుతో అవాంఛిత రోమాలు ఈజీగా తొలగించుకోవచ్చు..
X

దిశ, వెబ్‌డెస్క్ : యుక్త వయసు వచ్చిన అమ్మాయిలను, మహిళలను అవాంఛిత రోమాలు చిరాకు పెట్టిస్తాయి. ఫ్యాషన్‌గా స్లివ్ లెస్ డ్రెస్సింగ్ వేసుకోవాలన్నా అవాంచిత రోమాలతో ఇబ్బందులు పడుతుంటారు. మరి కొందరికి కాళ్లు, చేతులకు కూడా దట్టంగా వెంట్రుకలు ఉంటాయి. ఇలాంటి వాళ్లు ఇంకా ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ అవాంఛీత రోమాలు తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్లు లేదా ఎయిర్ రిమూవర్ లోషన్లు, లెజర్లను వాడుతుంటారు. అయితే షేవింగ్ అనంతరం వీటి వల్ల ఆ ప్రాంతాల్లో మంట రావడం, దురద పుట్టి అసహానానికి గురి చేస్తుంది. వీటన్నీంటికి చెక్ పెడుతూ ఇంట్లోనే తయూరు చేసుకునే సబ్బుతో అవాంఛిత రోమాలను ఈజీగా తొలగించుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. ఇదేలాగో చూద్దాం..

బాత్‌రూంలో అరిగి పోయిన సబ్బు ముక్కలను వృథాగా వదిలేస్తాం. అలా వదిలేసిన సబ్బు ముక్కలను తీసుకుని, వాటితోపాటు పసుపు, బేరియం సల్ఫేట్ పౌడర్ తీసుకోవాలి. ముందుగా సబ్బు ముక్కలు మాడిపోకుండా హీటర్ ద్వారా వేడి చేసి కరిగించాలి. దానిలో చిటికెడు పసుపు, టీస్పూన్ బేరియం సల్ఫేట్ పౌడర్‌ను మిక్స్ చేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక ముద్దగా చేస్తే సబ్బు తయారీ అయినట్టే.

హెయిర్‌ను ఇలా తొలగించుకోవాలి

అవాంచీత రోమాలను ముందుగా నీటితో తడిపి.. ఆ తర్వాత తయారు చేసుకున్న సబ్బును సున్నీతంగా అప్లై చేసుకోవాలి. అలా చేస్తున్న సమయంలో అవాంఛిత రోమాలు ఎలాంటి నొప్పి, దురద లేకుండానే సహజంగా ఊడిపోతాయి. అయితే ఈ ప్రాసెస్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. రోమాలు రిమూవ్ అయ్యాక శుభ్రమైన నీటికి ఆయా ప్రాంతాలను క్లిన్ చేసుకోవాలి. ఈ సబ్బుతో కేవలం ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కాదు.. కాళ్లకు, చేతులకు ఉన్న వెంట్రుకలను కూడా తొలగించుకోవచ్చు. అయితే శరీరంపై గాయాలు ఉన్న వాళ్లు, సున్నితమైన చర్మం ఉన్న వాళ్లు దీనిని ఉపయోగించకపోవమే మంచిది. ఎవరు ఈ సబ్బును వాడిన నిపుణుల సలహా, సూచనల అనంతరమే ఉపయోగించాల్సి ఉంటుంది.


Next Story

Most Viewed