కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణ

by Dishanational1 |
కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణ
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి రెండవ రోజు పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించడంతో విద్యార్థులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొని కేంద్రీయ విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయంలో చదువుకునే విద్యార్థులకు అధ్యాపకులు ఉన్నతమైన చదువులు అందించాలని కోరారు. విద్యార్థులకు అధ్యాపకులు పుస్తక పఠనంతోపాటు సమాజ జ్ఞానం కూడా నేర్పించాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తుచేశారు.

కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్న విద్యార్థులపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని.. వారిని ఆ విధంగా తయారు చేసి ఉన్నత శిఖరాలకు చేర్చే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా కేంద్రీయ విద్యాలయంలో ఉన్న పదవ తరగతి విద్యార్థులతో త్వరలోనే మాట్లాడనున్నారని, విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టడానికి ఈ మాన్ కి బాత్ కార్యక్రమామం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు, మంచిర్యాల జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు, కేంద్రీయ విద్యాలయం ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed