ట్విట్టర్‌లో 'కోట్వీట్స్'

by Disha Web Desk |
ట్విట్టర్‌లో కోట్వీట్స్
X

దిశ, ఫీచర్స్ : ట్విట్టర్‌లో కోట్వీట్స్(CoTweets) అనే కొత్త ఫీచర్ వచ్చేసింది. ఇది ఒక ట్వీట్‌కు సంబంధించి ఇద్దరు యూజర్లకు సహకరించేందుకు లేదా ఒకే పోస్ట్‌ను కలిసి కోట్వీట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇక ఈ సరికొత్త ఫీచర్ గురించిన మరిన్ని వివరాల విషయానికొస్తే..

ట్విట్టర్ ప్రకారం యూజర్లు 'కో-ట్వీట్' కోసం మరొక యూజర్‌కు ఆహ్వానాన్ని పంపవచ్చు. ఇన్వైటర్ దాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ముఖ్యంగా ఒక యూజర్ అనుమతి లేకుండా మరొక వ్యక్తిని ట్వీట్‌కు జోడించలేరు. ఒకవేళ అతడు దానికి అంగీకరించినట్లయితే రాసిన ట్వీట్ స్పష్టంగా ఇద్దరు వినియోగదారుల టైమ్‌లైన్స్‌లో కనిపిస్తుంది. ఒకవేళ అంగీకరించకుండా ఖాతాను పూర్తిగా బ్లాక్ చేయడం ద్వారా భవిష్యత్తులో CoTweet ఆహ్వానాలు పంపకుండా ఇతర యూజర్లను కూడా బ్లాక్ చేసే అవకాశముంది. మీరు ఆహ్వానాన్ని అంగీకరించిన తర్వాత మనసు మార్చుకుంటే ఉపసంహరించుకోవచ్చు కూడా. అప్పుడు CoTweet సాధారణ ట్వీట్‌కు తిరిగొస్తుంది. ఈ ఇన్విటేషన్స్ నోటిఫికేషన్‌ ట్యాబ్‌లో లేదా DMలలో కనిపిస్తాయి. ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసి, పోస్ట్ చేసిన CoTweetsను తీసేయొచ్చని ట్వి్ట్టర్ తెలిపింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ప్రస్తుతం యూఎస్, కెనడా, కొరియా వంటి సెలెక్టెడ్ ఏరియాల్లో కొంతమంది యూజర్ల కోసమే అందుబాటులోకి వచ్చింది.

CoTweetని ఎలా ప్రచురించాలి?

కోట్వీట్స్‌ను సాధారణ ట్వీట్‌ మాదిరిగానే రూపొందించవచ్చు. అయితే యూజర్ పోస్ట్‌కు కోరైటర్‌గా మరొక వ్యక్తిని ఆహ్వానించేందుకు CoTweet చిహ్నాన్ని ఎంచుకోవాలి. సదరు వ్యక్తి మిమ్మల్ని అనుసరిస్తుండటంతో పాటు పబ్లిక్ ఖాతా కలిగి ఉండాలి. ప్రస్తుతం ఒకే ఒక్క యూజర్‌తో మాత్రమే CoTweet చేయొచ్చు. ట్వీట్‌ను చూడగలిగే ఏ యూజర్ అయినా ఈ కోట్వీట్స్‌ను రీట్వీట్‌ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు కానీ షేర్ చేయరాదు. అంతేకాదు అసలు రచయిత(కోట్వీట్ ఇన్విటేషన్ పంపిన వ్యక్తి) మాత్రమే CoTweetని పిన్ చేయగలరు. CoTweetsను ఇద్దరు రచయితల పేర్లతో పాటు ప్రొఫైల్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు. ఇవి ఇద్దరు రచయితల టైమ్‌లైన్స్ అనుసరించేవారికి కనిపిస్తాయి.

'ట్విట్టర్‌లో ప్రజలు ఒకరికొరు సహకరించుకునేందుకు కొత్త మార్గాల అన్వేషిస్తున్నాం. కొత్త ప్రేక్షకులను పెంచుకోవడానికి, చేరుకోవడానికి, ఇతర ఖాతాలతో వారి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వ్యక్తులు, బ్రాండ్స్ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకునేందుకు మేము పరిమిత సమయం వరకు CoTweetsను పరీక్షిస్తున్నాం' అని ట్విట్టర్ పేర్కొంది.



Next Story

Most Viewed