నోటిఫికేషన్ కోసం చూస్తున్నారా.. ఉద్యోగార్థులకు TSPSC కీలక సూచనలు!

by GSrikanth |
నోటిఫికేషన్ కోసం చూస్తున్నారా.. ఉద్యోగార్థులకు TSPSC కీలక సూచనలు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా ఉద్యోగాల ప్రకటన చేయడంతో నిరుద్యోగులంతా సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఉద్యోగ వేట ప్రారంభించిన యువతీ, యువకులు నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని టీఎస్ పీఎస్‌సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. అయితే, అభ్యర్థులంతా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది. ఓటీఆర్ ఐడీ ద్వారా ఉద్యోగానికి నిమిషాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారని స్పష్టం చేశారు. జిల్లాలు, జోన్‌లు, మల్టీ జోన్ల ఆధారంగా స్థానికత వివరాలను సమర్పించాలని సూచించారు. కాగా, విడతల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ముందుగా 30 వేలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed