పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో సైబర్ వల! తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్ ఇదే..

by Ramesh N |
పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో సైబర్ వల!  తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్ ఇదే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసపూరిత లింకులు పంపిస్తున్నారని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ పోలీస్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. పార్ట్ టైమ్ ఉద్యోగం/వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేర్లతో మోసపూరిత లింకులు పంపించి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారని పేర్కొంది.

లేదా ఉద్యోగం రావాలంటే కొంత అమౌంట్ ముందస్తుగా కట్టాలని మాయమాటలు చెప్తారని తెలిపింది. అలాంటి దగాపూరిత వలలో చిక్కి మీ కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్ల పాలు చేయకండని హితువు పలికారు. కాగా, పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన మహిళ నుంచి రూ.14.5లక్షలు దోచేశారు.Next Story

Most Viewed