భార్య పేరు మీద హౌస్ లోన్ తీసుకోండి.. లక్షలాది రూపాయలు సేవ్ చేయండి.. ఎలాగంటే?

by Kavitha |
భార్య పేరు మీద హౌస్ లోన్ తీసుకోండి.. లక్షలాది రూపాయలు సేవ్ చేయండి.. ఎలాగంటే?
X

దిశ, ఫీచర్స్: సహజంగా ఇల్లు కట్టుకోవాలనుకోవడం ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కలను సాకారం చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే సామాన్యులు కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలనే కలను సాకారం చేసుకోవాలంటే ఆ ఇల్లు ఎవరి పేరు మీద కొనాలనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మహిళల పేరుతో ఇల్లు కొంటే చాలా అదనపు బెనిఫిట్స్‌ని పొందవచ్చు. దీనివల్ల ఎక్కువ ఇబ్బంది పడకుండా సులభంగా ఇల్లు కట్టుకోవచ్చు. అసలు హౌస్ లోన్ మహిళ పేరు మీద తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం...

*రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అనేక బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు మహిళలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తున్నాయి. సాధారణంగా మహిళలకు 5 నుంచి 10 పాయింట్ల వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే పురుషులతో పోలిస్తే మహిళలకు 0.05 నుంచి 0.10 శాతం తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. క్రెడిట్ స్కోర్ కూడా దాని ఆధారంగానే ఉంటుంది. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఇది గణనీయమైన మొత్తాన్ని ఆదా చేస్తుంది.

*ఫస్ట్ ఫాల్ మహిళల పేరుతో రుణం తీసుకుంటే ఏదైనా తగ్గింపు ఉందా? అని కూడా తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు సహ-రుణగ్రహీతగా ఉన్నట్లయితే, అంటే ఉమ్మడి రుణగ్రహీతలలో ఒకరు లేదా రుణానికి సహ-దరఖాస్తుదారుగా ఉన్నట్లయితే కూడా తగ్గింపును అందిస్తాయి.

*స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - SBI పురుషులకు 9.15% ప్రారంభ వడ్డీ రేటును అందిస్తుంది. అయితే ఎస్‌బీఐ మహిళలకు 0.05 శాతం వడ్డీని తగ్గించనుంది. ఈ విధంగా, మహిళలకు రుణాలపై ప్రారంభ వడ్డీ రేటు 9.10 శాతంగా ఉంటుంది.

*అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ గృహ లక్ష్మి యోజన కింద మహిళలకు 8.35 నుంచి 9.25 శాతం వడ్డీ రేటు ఉండగా, ఇతరులకు 8.5 నుంచి 9.5 శాతంగా ఉంది. దీర్ఘకాలంలో లక్షలు ఆదా అవుతాయి.

*ఇక చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు ఇళ్లు కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీలో రాయితీని ఇచ్చాయి. ఆస్తి యొక్క ఉమ్మడి యజమానులు కూడా ఈ తగ్గింపును పొందుతారు. ఉదాహరణకు ఢిల్లీలో, స్టాంప్ డ్యూటీ మహిళలకు 4 శాతం మరియు పురుషులకు 6 శాతం, అదే విధంగా, హర్యానాలో, స్టాంప్ డ్యూటీ పురుషులకు ఆస్తి విలువలో 7 శాతం మరియు మహిళలకు 5 శాతం.

*అలాగే బాలికల ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మహిళలకు వడ్డీ రాయితీ లభిస్తుంది. రుణం తీసుకుని మహిళల పేరుతో ఇల్లు కొనడం ద్వారా దాదాపు ఆరు లక్షల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

Next Story

Most Viewed