అంత‌రిక్షంలో మూడు న‌క్ష‌త్రాల వ్య‌వ‌స్థ‌.. మొట్ట‌మొద‌టిసారి ఆవిష్క‌ర‌ణ‌!

by Disha Web Desk 20 |
అంత‌రిక్షంలో మూడు న‌క్ష‌త్రాల వ్య‌వ‌స్థ‌.. మొట్ట‌మొద‌టిసారి ఆవిష్క‌ర‌ణ‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః అంతరిక్షం లోలోతుల్లో మూడు న‌క్ష‌త్రాలు, అందులోనూ ఒకొక్క‌టీ 12 సూర్యుల‌ మందం ఉన్న‌వి, వాటి వాటి క‌క్ష్య‌లో తిరుగుతున్న‌ట్లు ఊహించుకోండి! అత్య‌ద్భుత‌మైన ఈ ఊహ నిజ‌మైతే.. అంతుప‌ట్ట‌ని ఈ విశ్వంలో ఈ ట్రిపుల్ స్టార్ సిస్టమ్‌ క‌నువిందు చేసింది. విశ్వాన్ని ఇంకొంచెం మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించాలని చూస్తున్న ఖగోళ శాస్త్రవేత్తల్లో ఇది ఒక ముఖ్య‌మైన‌ అంశంగా మారింది. 'ట్రిపుల్ స్టార్ సిస్ట‌మ్‌'గా పేర్కొంటున్న‌ ఈ వ్య‌వ‌స్థ‌ "ఇంతకు ముందు చూసిన వాటన్నింటి కంటే భిన్నంగా ఉంది" అని నిపుణులు వర్ణించారు. ది రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ మంత్లీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఈ వ్యవస్థలో నాల్గవ నక్షత్రం ఉందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. కానీ, దాన్ని ఇతర మూడు నక్షత్రాలు "మింగేస్తాయి" అని కూడా ప‌రిశోధ‌క‌లు భావిస్తున్నారు.

"మనకు తెలిసినంతవరకు, ఇది మొట్టమొదటిసారి క‌నుగొన‌బ‌డింది. మనకు అనేక మూడు నక్షత్ర వ్యవస్థలు (త్రీ-స్టార్ సిస్టమ్‌లు) గురించి తెలుసు. కానీ, అవి సాధారణంగా భారీ స్థాయిలో ఉండ‌టం త‌క్కువ‌. అయితే, ఈ ట్రిపుల్‌లోని భారీ నక్షత్రాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది ఒక కాంపాక్ట్ సిస్టమ్," అని నీల్స్ బోర్ ఇంటర్నేషనల్ అకాడమీలో అధ్యయనం, పోస్ట్‌డాక్టోర‌ల్ ప‌రిశోధ‌కులైన‌ ప్రధాన రచయితల్లో ఒక‌రు అలెజాండ్రో విగ్నా-గోమెజ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదట, ఈ వ్యవస్థలో రెండు నక్షత్రాలు ఉన్నాయని పరిశోధకులు భావించారు. కాని, సివిల్ సైంటిస్ట్‌లు, నాసా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) అబ్జర్వేటరీ నుండి డేటాను ఉపయోగించి, మూడవ నక్షత్రాన్ని ట్రాక్ చేయగలిగారు. నాసా ఈ సమయంలో విశ్వంలోని మొత్తం న‌క్ష‌త్ర వ్య‌వ‌స్థ‌ల్లో 10% లోపు మాత్ర‌మే అంచనా వేయడంతో, లోతైన అంతరిక్షంలో ట్రిపుల్ స్టార్ సిస్టమ్‌లు ఉండటం సాధారణం కాదని తెలిసింది. ఇక‌, ఈ రకమైన వ్య‌వ‌స్థలో మొదటి ఆవిష్కరణ సెప్టెంబరు 2021లో జరిగిన‌ప్ప‌టికీ, తాజాగా క‌నుగొన్న‌ది మాత్రం ఈ రంగంలో ఇంతకు ముందు కనుగొన్న దానికంటే పెద్దది కావ‌డం విశేషం.


Next Story

Most Viewed