లగేజ్ కోసం ఇండిగో వెబ్ సైట్‌ను హ్యాక్ చేసిన యువకుడు

by Disha Web Desk 12 |
లగేజ్ కోసం ఇండిగో వెబ్ సైట్‌ను హ్యాక్ చేసిన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఎయిర్ పోర్ట్‌లో తన లాగేజ్ మరొక ప్రయాణికునికి వెళ్లడంతో ఆ ప్రయాణికుని అడ్రస్ కనుగొనుటకు ఇండిగో వెబ్ సైట్‌ను ఓ యువకుడు ''హ్యాక్'' చేశాడు. వివరాల్లోకి వెళితే.. సాఫ్టవేర్ డెవలపర్‌గా పని చేస్తున్న నందర్ కూమార్ ఇండిగో విమానంలో బెంగళూరుకు ప్రయానిస్తున్నాడు. ఈ క్రమంలో తన బ్యాగ్ తారుమారు అయి మరొక ప్రయానికుతో బ్యాగ్ లు మారాయి. ఈ విషయం నందకుమార్ భార్య ఇంటికి వెళ్ళాక గమనించి చెప్పింది. దీంతో అతను ఇండిగో కస్టమర్ కేర్‌కు కాల్ చేసాడు.

అయితే కస్టమర్ కేర్ నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ డెవలపర్ అయిన నందకుమార్ ఇండిగో వెబ్ సైట్ ను ''హ్యాక్'' చేసి స్వయంగా తన బ్యాగ్ తీసుకెళ్లిన ప్రయాణికుని వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో తాను ఆ సైట్ ను ఎలా హ్యాక్ చేయడానికి ప్రయత్నించాడో ట్విట్టర్ ద్వారా తెలిపారు. మొత్తానికి నందకూమార్ తోటి ప్రయానికుని అడ్రస్ కనుక్కోని తన బ్యాగ్‌ను తెచ్చుకున్నాడు.







Next Story

Most Viewed