ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు పోలీసు శాఖ సిద్ధం : డీజీపీ

by Disha Web Desk |
ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు పోలీసు శాఖ సిద్ధం : డీజీపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన గురించి నిరుద్యోగులంతా గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. తాజా ప్రకటనలో పోలీస్ డిపార్ట్మెంట్ లో 18,334 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు రాష్ట్ర పోలీసు శాఖ సిద్ధమైంది. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఫ్రీ కోచింగ్ పై ప్రకటన విడుదల చేశారు. పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారి కోసం రాష్ట్రవ్యాప్తంగా.. జిల్లా, కమిషనరేట్ల పరిధిలో అభ్యర్థులకు ఉచితంగా ముందస్తు శిక్షణ ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. ఈ కోచింగ్ విజయవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు, కమిషనర్లకు సూచించారు.


Next Story