కూకట్​పల్లిలో చిరు వ్యాపారిపై తల్వార్​లతో దాడి.. నిందితులపై తిరగబడ్డ స్థానికులు.. వీడియో వైరల్

by Disha Web |
కూకట్​పల్లిలో చిరు వ్యాపారిపై తల్వార్​లతో దాడి.. నిందితులపై తిరగబడ్డ స్థానికులు.. వీడియో వైరల్
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని శంషీగూడలో తల్వార్​లతో దాడి సంఘటన స్థానికంగా హల్​చల్‌గా మరింది. శంషీగూడ ప్రాథమిక పాఠశాల సమీపంలో అప్పికట్ల నరేంద్ర(30) అనే వ్యక్తికి చెందిన కొబ్బరి బోండాల బండి వద్దకు రాధకృష్ణ, కుల్దీప్​ సింగ్​, హరిదీప్​ సింగ్​తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కొబ్బరి నీళ్లు తాగడానికి వచ్చారు. డబ్బులు ఇవ్వమని అడిగితే మా వద్దే డబ్బులు అడుగుతావా, మా జాగాలో వ్యాపారం చేసుకుంటున్నావు, కొబ్బరి బొండాల వ్యాపారం చేయలేవు అంటు నరేంద్రతో గొడవకు దిగారు.

దీంతో తాను స్థానికంగా ఉన్న పెద్ద మనిషితో మాట్లాడి బండి పెట్టుకున్నానని చెప్పి సదరు పెద్ద మనిషితో మాట్లాడమని ఫోన్​ కలిపి ఇవ్వబోగా సదరు వ్యక్తులు ఫోన్​ తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోయే ప్రయత్నం చేశారు. దీంతో నరేంద్ర వారి నుంచి తన ఫోన్​ లాక్కోవడానికి ప్రయత్నించగా రాధాకృష్ణ, కులదీప్​ సింగ్​, హరిదీప్​ సింగ్​ మరో ఇద్దరు నరేంద్రపై తల్వార్​లతో దాడికి దిగారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు నరేంద్రను కాపాడే ప్రయత్నం చేస్తు వారిపై తిరగబడ్డారు. ఈ క్రమంలో తల్వార్​లతో దాడి చేయడంతో స్థానికులు కొంత మందికి గాయాలైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న కూకట్​పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మూడు రోజుల ముందు:

కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో సరిగ్గా మూడు రోజుల ముందు శుక్రవారం రాజీవ్​గాంధీ నగర్​ కాలనీలో రెండు వర్గాలు తల్వార్​లు, ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటన జరిగి కేసు దర్యాప్తు దశలో ఉండగానే మరో సారి తల్వార్​లతో గొడవ పోలీస్​ స్టేషన్​ పరిధిలో శాంతిభద్రతలు, పోలీసుల నిఘా, పెట్రోలింగ్​ వ్యవస్థపై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

Next Story

Most Viewed