డిండి మండల కేంద్రంలో విషాదం.. గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Shiva |
డిండి మండల కేంద్రంలో విషాదం.. గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ, డిండి: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన డిండి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం ప్రాజెక్టు వద్ద నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారంతా పంచాయతీ కార్యదర్శి గోరటి జంగయ్య సమాచారం అందజేశారు. ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. మృతురాలి వయస్సు దాదాపుగా 50 సంవత్సరాల వరకు ఉంటుందని, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని, ఎత్తు 5.4 ఎత్తు ఉంటుందన్నారు. మృతురాలి చీర ఎరుపు రంగు, జాకెట్ ఆకుపచ్చ రంగులో ఉందని తెలిపారు. ఒంటిమీద ఎలాంటి ఆభరణాలు లేవని, ఆమె రెండు చేతులకు నాలుగ బంగారు రంగు గాజులు ఉన్నాయని తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన వారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డిండి సర్కిల్ 8712670155, ఎస్ఐ డిండి 8712670223 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Next Story