BREAKING: అధికార వైసీపీలో కీలక పరిణామం... ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

by Shiva |
BREAKING: అధికార వైసీపీలో కీలక పరిణామం... ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ అధికార వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి ఇటీవల ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై వెంటనే చర్యలు తీసుకుకోవాలంటూ వైసీపీ విఫ్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన చైర్మన్ కొయ్యే మోషేనురాజు ఫిరాయింపుల చట్టం కింద జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. అందుకు సంబంధించి బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Advertisement

Next Story