Snapchat కొత్త ఫీచర్.. "కస్టమ్ ల్యాండ్‌మార్కర్స్"

by Disha Web Desk 17 |
Snapchat కొత్త ఫీచర్.. కస్టమ్ ల్యాండ్‌మార్కర్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ "కస్టమ్ ల్యాండ్‌మార్కర్స్" అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్ స్థానికంగా ఉండే స్థలాల కోసం ప్రత్యేకమైన AR లను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ స్థానిక కమ్యూనిటీలలో విగ్రహాలు, స్టోర్ ఫ్రంట్‌ల వంటి వాటి కోసం ల్యాండ్‌మార్కర్‌లను AR మోడ్‌లో రూపొందించడానికి ఉపయోగించబడుతుందని కంపెనీ పేర్కొంది. AR ద్వారా సులభంగా వినియోగదారులు ల్యాండ్‌మార్కర్‌లు అర్థం చేసుకుంటారని కంపెనీ తెలిపింది. డిసెంబర్‌లో జరిగిన స్నాప్ లెన్స్ ఫెస్ట్ ఈవెంట్‌ తర్వాత కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ల్యాండ్‌మార్క్ వద్ద భౌతిక స్నాప్‌కోడ్‌ల ద్వారా కొత్త కస్టమ్ ల్యాండ్‌మార్కర్‌లను రూపొందించవచ్చు. Snapchat తన AR ప్లాట్‌ఫారమ్‌ను నిరంతరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగానే దీన్ని ప్రారంభించింది.

Next Story

Most Viewed