అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత!

by Web Desk |
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత!
X

దిశ, పటాన్‌చెరు: అక్రమంగా నిల్వ చేసి, రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు పారిశ్రామిక వాడలో పట్టుకున్నారు. శుక్రవారం సివిల్ సప్లై ఉప తహశీల్దార్ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశంమైలారం పారిశ్రామిక వాడాలోని ఒక గోదాంలో నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు కలిసి తనిఖీ నిర్వహించామన్నారు.

సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఒక లారీ, 3 ఆటోలను సీజ్ చేశామని చెప్పారు. అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు శంకర్, నాయికోటి మాణిక్యం లతో పాటు 6 మందిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ బియ్యాన్ని యాదాద్రి, భువనగిరి, సికింద్రాబాద్ తదితర పరిసర ప్రాంతాలలోని ప్రజల వద్ద రూ.10 తీసుకుని, గుజరాత్ రాష్ట్రానికి తరలించి అక్కడ 14 రూపాయల వరకు బేరం కుదుర్చుకున్నారని తెలిపారు. అక్రమ రేషన్ బియ్యాన్ని లారీలో తరలించే క్రమంలో పట్టుకున్నామన్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని పటాన్‌చెరు పట్టణంలోని గోదాంకు తరలించడం జరిగిందన్నారు. ఎవరైనా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఒడిగడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Next Story

Most Viewed