నకిలీ టీ పొడి, నిషేధిత గుట్కా పట్టివేత

by Disha Web Desk 13 |
నకిలీ టీ పొడి, నిషేధిత గుట్కా పట్టివేత
X

దిశ, కొడంగల్: నకిలీ టీ పొడి, ప్రభుత్వ నిషేధిత గుట్కాలను పట్టుకున్నట్లు కొడంగల్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో మంగళవారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది పక్కా సమాచారంతో కిరాణా, పాన్ షాప్‌లో, హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు రూ. ఐదు లక్షల విలువగల నకిలీ టీ పొడి, ప్రభుత్వ నిషేధిత గుట్కా జర్దా లు లభ్యమయ్యాయని, వాటిని సీజ్ చేసి, దుకాణ యజమానులపై కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కొడంగల్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వాటిని పరిశీలించి.. కొడంగల్ సీఐ ఇఫ్త్ కార్ అహ్మద్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నకిలీ వ్యర్థాలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు.


నకిలీ టీ పొడితో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, దీనిలో నిషేధిత కెమికల్స్ వాడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీలపై కొరడా జూలీస్తామని, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నకిలీ పదార్థాలు అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ పెడతామని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి ముద్దాయిగా మల్లికార్జున్ సన్ ఆఫ్ భద్రప్ప, కోసిగి మండలం సంపల్లి గ్రామం. మిగతా ముగ్గురు రావులపల్లి గ్రామానికి చెందిన వారని కాశీనాథ్, మేఘరాజ్, లక్ష్మీకాంత్ మొత్తం నలుగురిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. నకిలీ వ్యర్థాలను పట్టుకున్న వారిలో టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేష్, మోమిన్పేట్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్, కొడంగల్ ఏఎస్ఐ గణేష్, కొడంగల్ సీఐ ఇఫ్తకర్, అహ్మద్, సిబ్బంది పాల్గొన్నారు.


Next Story