ఈటల రాజేందర్‌ అలా చేస్తాడనే సభకు రానివ్వడం లేదు: రాజాసింగ్

by Satheesh |
ఈటల రాజేందర్‌ అలా చేస్తాడనే సభకు రానివ్వడం లేదు: రాజాసింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ మాటల్లో భయం కనబడుతుందని అన్నారు. కేసీఆర్ స్పీకర్‌ను టార్చర్ పెడుతున్నారని పేర్కొన్నాడు. అసెంబ్లీ సమావేశాల సమయంలో అసలు పోడియం దగ్గరకు కూడా రానీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులను సభ నుండి సస్పెండ్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్లాన్‌నే సభలో స్పీకర్ అమలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో 10మంది ఎమ్మెల్యేలు గొడవ చేసిన సస్పెండ్ చేయలేదు.. కానీ ఏ గొడవ చేయని బీజేపీ ఎమ్మెల్యేలను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఫైర్ అయ్యారు. గతంలో నిజాంలు ఎంత దౌర్జన్యం చేశారో.. ఇప్పుడూ కేసీఆర్ అదే చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల రక్తం తాగుతున్న కేసీఆర్‌ను త్వరలోనే గద్దె దించుతామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలకు ఈటల రాజేందర్ వస్తే.. కేసీఆర్ పాపలను సభలోనే భయటపెడుతారనే భయంతోనే ఆయనను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.

Next Story

Most Viewed