ఇరాక్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై నిరసనలు..

by Disha Web Desk 22 |
ఇరాక్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై నిరసనలు..
X

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ వేలాది మంది నిరసనలు తెలిపారు. ఇరాన్ మద్దతు గల గ్రూపులు ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ మక్తుదా అల్ సదర్ మద్దుతు దారులు శనివారం పార్లమెంటు భవనం‌లోకి దూసుకెళ్లారు. పెద్ద ఎత్తున వచ్చిన నిరసనకారులను చెదరగొట్టడానికి ఇరాక్ భద్రతా దళాలు టియర్ గ్యాసు‌తోపాటు సౌండ్ బాంబులను ప్రయోగించాయి. ఈ క్రమంలో పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీంతో చట్టసభ్యులు ఎవరూ లేకపోవడంతో పార్లమెంటు సమావేశం నిర్వహించలేకపోయారు. మరోవైపు నిరసనకారులను రక్షించాలని భద్రతా బలగాలను ప్రధాని ముస్తాఫా అల్ కధిమి ఆదేశించారు. వారిని శాంతియుతంగా నిరసనలు చేసుకోనివ్వాలని పేర్కొన్నారు. గత బుధవారం కూడా ఫ్రేమ్ వర్క్ కూటమి మహ్మద్ అల్ సుడానీ పేరును ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటు వద్ద నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.


Next Story