హైదరాబాద్‌లో మహిళలకు రక్షణెంత.. వారి మాటల్లోనే..

by Disha Web Desk |
హైదరాబాద్‌లో మహిళలకు రక్షణెంత.. వారి మాటల్లోనే..
X

దిశ, డైనమిక్ బ్యూరో : జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ ఉందా? అసలు మహిళలు ఏం కోరుకుంటున్నారు. ఈ విషయాలను తెలుసుకునేందుకు ప్రముఖ సామాజిక వేత్త కోట నీలిమ.. తన 'హక్కు' చానల్ ద్వారా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. అయితే, ఇందులో వివిధ వయస్సు గల మహిళలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇందులో ఓ మహిళ.. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ మహిళ సేఫ్‌గా ఉండలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. మరో మహిళ.. రాత్రి ఏడు అయిపోతే చాలు.. బస్సు ఎక్కాలంటే భయంగానే ఉంటుందని చెప్పారు. రాత్రి 9 అయ్యిందంటే చాలు తాగి రోడ్డుపైనే తిరుగుతా ఉంటారని.. పక్కనే ఉన్న దుకాణం కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని మరో మహిళ వాపోయారు. ఒకవేళ రాత్రి 9 తర్వాత ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే.. షేర్ ఆటోలోనో, బస్సులోనో మహిళా ప్రయాణికులు ఉన్నారా చూసి వెళ్లాల్సి వస్తోందన్నారు. సిటీలో ఎక్కడికైనా దూరం వెళ్లాల్సి వస్తే.. ఇంట్లో ఉన్న అన్న, తమ్ముడు, డాడీనో తీసుకెళ్తామని ఓ యువతి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి అభిప్రాయాల వీడియోను కోట నీలిమ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మరిన్ని వివరాల కోసం వీడియోను చూడండి.


Next Story