పిల్ల‌ల్ని వేధించి, సారీ చెబితే సరిపోదు.. పోప్ ఫ్రాన్సిస్‌పై కెన‌డా సీరియ‌స్‌!

by Disha Web Desk 20 |
పిల్ల‌ల్ని వేధించి, సారీ చెబితే సరిపోదు.. పోప్ ఫ్రాన్సిస్‌పై కెన‌డా సీరియ‌స్‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కెనడాలోని ఆదివాసీలపై జరిగిన అకృత్యాలకు పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల క్షమాపణలు చెప్పారు. అయితే, కెనడా ప్రభుత్వం మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. స్వ‌దేశీ పిల్లల్ని ఇంత‌గా హింసిస్తూ, కేవ‌లం క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదని చెప్పింది. ఇలాంటి బాధాకరమైన చరిత్ర ఇంకా కొన‌సాగుతూనే ఉందని ప్రభుత్వం సూచించింది. వెంట‌నే దీన్ని ఆపాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. కెనడాలో తన చారిత్రాత్మక పర్యటన సందర్భంగా, 85 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్, చ‌ర్చి న‌డుపుతున్న రెసిడెన్షియల్ పాఠశాలల్లో క్యాథలిక్ చర్చి పాత్రపై క్షమాపణలు కోరుతున్నాన‌న్నారు.

అయితే, ఇలాంటి అపఖ్యాతిని మూట‌గ‌ట్టుకున్న రెసిడెన్షియ‌ల్‌ పాఠశాలలు అక్క‌డి స్వ‌దేశీ సంస్కృతులను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయ‌ని, వారిపై క్రైస్త‌వ మ‌తాన్ని బ‌ల‌వంతంగా రుద్దుతున్నాయ‌ని ఎప్ప‌టి నుండో అప‌వాదులున్నాయి. పాఠశాలల్లో శారీరక, లైంగిక వేధింపులు ప్రబలంగా ఉన్నాయని, వారి స్థానిక భాషల్లో మాట్లాడినందుకు విద్యార్థులను కొట్టారని ఆరోప‌ణ‌లున్నాయి. అయితే, ఈ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా స్థానికులను సమీకరించే లక్ష్యంతో ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. కాగా, కెన‌డా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, గవర్నర్ జనరల్ మేరీ సైమన్‌లను క్యూబెక్ నివాసంలో కలవడానికి పోప్ ఫ్రాన్సిస్ క్యూబెక్ నగరానికి చేరుకున్న త‌ర్వాత కెన‌డా ప్రభుత్వం అధికారికంగా ఇలా స్పందించింది.


Next Story