లగ్జరీ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ POCO X4 GT .. స్పెషిఫికేషన్స్ ఇవే

by Disha Web |
లగ్జరీ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ POCO X4 GT .. స్పెషిఫికేషన్స్ ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: సరికొత్త POCO X4 GT స్మార్ట్ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది. ఇది Redmi Note 11T ప్రో రీ బ్రాండెడ్ వెర్షన్ అని పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ చిప్, ఎక్కువ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే‌తో లగ్జరీ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా వస్తుంది. ఫోన్ హీట్ కాకుండా ఉండటానికి ఏడు గ్రాఫైట్ షీట్ లేయర్‌లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది.


POCO X4 GT స్పెసిఫికేషన్స్

* 6.6-అంగుళాల IPS LCD ప్యానెల్‌, 1080 x 2400 పిక్సెల్‌ల పూర్తి HD+ రిజల్యూషన్‌.

* 144Hz రిఫ్రెష్ రేట్, 650నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డిస్‌ప్లే‌లో 1బిలియన్ కలర్ ఆప్షన్‌లు.

* MediaTek డైమెన్సిటీ 8100 చిప్‌సెట్ Mali-610 MC6 GPUతో పనిచేస్తుంది.

* గరిష్టంగా 8GB RAM 256GB స్టోరేజ్.

* హీట్ డిస్పర్షన్ కోసం అడ్వాన్స్‌డ్ లిక్విడ్-కూల్ టెక్నాలజీ 2.0 ఉంది.

* Android 12 ద్వారా MIUI 13 తో రన్ అవుతుంది.

* స్మార్ట్‌ఫోన్‌లో వెనుక వైపు 64MP+ 2MP + 8MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు భాగంలో సెల్ఫీల కోసం 20 MP కెమెరా ఉంది.

* ఇది 67W ఫాస్ట్ చార్జింగ్‌‌తో 5,080mAh బ్యాటరీ కలిగిఉంది.

* కేవలం 46 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,710. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 28,842.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed