ఇమ్రాన్ ప్రభుత్వానికి స్వల్ప ఊరట.. వాయిదా పడ్డ నేషనల్ అసెంబ్లీ

by Disha Web Desk 17 |
ఇమ్రాన్ ప్రభుత్వానికి స్వల్ప ఊరట.. వాయిదా పడ్డ నేషనల్ అసెంబ్లీ
X

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. శుక్రవారం అవిశ్వాస తీర్మానం జరగకుండానే నేషనల్ అసెంబ్లీ వాయిదా పడింది. సోమవారం తిరిగి సభ ప్రారంభమవుతుందని స్పీకర్ తెలిపారు. కాగా, తెహ్రీక్ ఈ ఇన్షాఫ్ ఎంపీ ఖాయల్ జమాన్ మరణానికి సంతాపం తెలిపిన తర్వాత సభను వాయిదా వేశారు. పాక్ పార్లమెంట్ సాంప్రదాయాల ప్రకారం సభ్యులు ఎవరైనా మరణిస్తే తొలి రోజును కేవలం సంతాపం తెలపడానికి మాత్రమే కేటాయిస్తారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై జరగాల్సిన అవిశ్వాస తీర్మానం కాస్త వాయిదా పడింది. ఇప్పటికే దేశంలో ఆర్థిక పరిస్థితులు దిగజారడానికి బాధ్యత వహిస్తూ, ఇమ్రాన్‌ను దిగిపోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి సంబంధించి స్పీకర్ కూడా తీర్మానాన్ని జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటివరకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న పార్టీలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో పెద్ద దెబ్బే పడింది.


Next Story