చర్చ చేయలేని చేతగాని దద్దమ్మ ఈటల: కౌశిక్ రెడ్డి

by Disha Web |
చర్చ చేయలేని చేతగాని దద్దమ్మ ఈటల: కౌశిక్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రమ్మంటే ముఖం చాటేసిన చేతగాని దద్దమ్మ ఈటల అంటూ సీరియస్ అయ్యారు. కేసీఆర్ ముఖం చాటేయడం తెలియదని.. హుజురాబాద్ కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశాడని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి కనీసం హుజురాబాద్‌లో గుంతల రోడ్డు కూడా బాగు చేయలేకపోయావని ఎద్దేవా చేశారు. కానీ, రూ.6 కోట్లు కేటాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్లు బాగుచేశారని అన్నారు. పార్టీలో కీలక మెంబర్‌గా.. 7 ఏళ్లు మంత్రిగా ఉండి కూడా సొంత ఊరు కమలాపూర్‌కు బస్టాండ్ కట్టించలేకపోయావని, ఇప్పుడు తాము రూ.2 కోట్లతో అక్కడ బస్టాండ్ కడుతున్నామని అన్నారు. 9 నెలల్లో ఒక్కసారైనా హుజురాబాద్‌లో లక్ష రూపాయల పనులైనా చేసావా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నీవు రూ.100 కోట్లు తెస్తే.. నేను రూ.150 కోట్లు తెస్తా. కనీసం ఈ సవాలైనా స్వీకరించు అని చాలెంజ్ చేశారు. ''బీజేపీ కొడకల్లారా.. కేసీఆర్‌ను ఏమైనా అంటే బట్టలిప్పి కొడతాం. మేము గాజులేసుకోలేదు. తిడితే ఊర్కోం. హుజురాబాద్ జిల్లా కావాలని దీక్ష చేస్తే ఈటల నీతి లేని దీక్ష అన్నాడు. జిల్లా కాకపోవడం వల్ల అనేక రకాలుగా హుజురాబాద్ అభివృద్ధికి దూరమైంది. నా ఎమ్మెల్సీ పదవి నీ ఎమ్మెల్యే కంటే పెద్దది. వాస్తవంగా నీతో నేనే చర్చకు రావద్దు. నాది తన స్థాయి కాదంటున్న ఈటల.. కేసీఆర్‌‌తో పోలిస్తే నీ స్థాయి వెంట్రుకంత'' అని ఘాటుగా విమర్శించారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed