కాంగ్రెస్‌కు 58 శాతం తగ్గిన ఆదాయం.. పెరిగిన బీజేపీ మిత్రపక్షం ఆదాయం

by Disha Web |
కాంగ్రెస్‌కు 58 శాతం తగ్గిన ఆదాయం.. పెరిగిన బీజేపీ మిత్రపక్షం ఆదాయం
X

న్యూఢిల్లీ: 2021 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆదాయం భారీగా తగ్గింది. ఒక్క ఏడాదిలోనే 58శాతానికి పైగా ఆదాయం తగ్గినట్లు ఎన్నికల కమిషన్‌కు నివేదికను సమర్పించింది. అంతేకాకుండా పార్టీ ఎన్నికల వ్యయం కూడా భారీగా తగ్గినట్లు పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రూ. 998.15 కోట్లు ఖర్చు చేయగా, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.209 కోట్లకు తగ్గినట్లు నివేదికలో తెలిపింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ ఆదాయం రూ.918 కోట్లు కాగా, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చినట్లు వెల్లడించింది. ఆడిట్ నివేదిక ప్రకారం పార్టీకి ఆదాయం ఎక్కువగా కూపన్లు జారీ చేయడం ద్వారా రూ.156.19 కోట్లు వచ్చాయని పార్టీ చెప్పింది. ఇక గ్రాంట్లు, విరాళాలు ద్వారా రూ.95.4 కోట్లు, ఫీజులు- సబ్ స్క్రిప్షన్ల ద్వారా రూ.20.7 కోట్లు సేకరించారు. మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్(యునైటెడ్) కూడా తమ నివేదికలను ఈసీకి సమర్పించాయి. దీనిలో ఎన్సీపీ ఆదాయం కూడా తగ్గగా, బీజేపీ మిత్రపక్షం జేడీయూ ఆదాయం మాత్రం రెండున్నర రెట్లకు పైగా పెరిగింది.



Next Story

Most Viewed