ఇక ఒకే దేశం.. ఒకే కార్డు.. నకిలీగాళ్లకు చెక్ పడనుందా?

by Disha Web Desk |
ఇక ఒకే దేశం.. ఒకే కార్డు.. నకిలీగాళ్లకు చెక్ పడనుందా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : వాహనం రోడ్డెక్కాలంటే దానికి రిజిస్ట్రేషన్ కార్డు ఉండాలి. దానిని నడపాలంటే లైసెన్స్ ఉండాలి. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే రోడ్డెక్కుతున్నారు కొందరు వాహనదారులు. దీనితో పాటు దొంగ వాహనాలకు నకిలీ ఆర్సీని సృష్టించి పోలీసులకు చిక్కకుండా దర్జాగా తిరుగుతున్నారు. దీంతో పోలీసులు, ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేసినా దొంగలు పట్టుబడటం లేదు. వీటన్నింటికి చెక్ పెట్టి వాహనదారుల లైసెన్సులు, ఆర్సీలను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం ఒకే దేశం-ఒకే కార్డు విధానాన్ని తీసుకొచ్చింది.

నూతన కార్డుల్లో చిప్‌తో పాటు, వెనుక భాగంలో క్యూఆర్ కోడ్‌ను అమర్చగా.. డ్రైవింగ్ లైసెన్సుల వెనుక ఏ వాహనం నడిపే అనుమతి ఉందో దానికి సంబంధించిన బొమ్మలు ప్రింట్ చేశారు. అంతేగాకుండా, కార్డుల రంగులను మార్చేసి డెబిట్ కార్డు మాదిరిగా తయారు చేశారు. ప్రధానంగా కార్డు వెనుక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. దీన్ని స్కాన్ చేస్తే చాలు.. లింక్ ద్వారా కార్డుదారుడి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే, ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్సీ, లైసెన్సు కార్డులు ఉన్నాయి. దీంతో వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ, కేంద్రం తీసుకొచ్చిన తాజా కార్డులతో దేశంలో ఎక్కడ తనిఖీలు చేసినా వివరాలు తెలిసిపోతాయి.



Next Story

Most Viewed