దిశ ఎపెక్ట్: కార్మిక శాఖను కదిలించిన వైనం

by Dishanational1 |
దిశ ఎపెక్ట్: కార్మిక శాఖను కదిలించిన వైనం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దిశ దిన పత్రిక నిజామాబాద్ ఎడిషన్ లో మంగళవారం ప్రచురితమైన 'రెన్యూవల్ సర్టిపికెట్ నకిలివా? ఒరిజినలా? కథనం జిల్లా కార్మిక శాఖను కదిలించింది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఈ విషయంపై కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ను కలెక్టరేట్ కు పిలిచి వివరణ కోరినట్టు తెలిసింది. దానితో కార్మిక శాఖ అధికారులు ఆర్మూర్ లేబర్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ను పిలిచి వివరణ కోరడం గమనార్హం. ఆర్మూర్ డివిజన్ లోని అంకాపూర్ లో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లలో జారీ చేసిన లైసెన్స్ రెన్యూవల్ సర్టిఫికెట్ల విషయంలో జరిగిన వసూళ్ల వ్యవహరంలో ప్రమేయం ఎవ్వరిది అని ఆరా తీసినట్లు తెలిసింది. అసలు ఈ విషయం బయటకు ఎలా పొక్కిందని కార్మిక శాఖాధికారులు తర్జన భర్జన పడటం విశేషం. సంబంధిత సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ల యాజమానుల ద్వారా బయటకు వచ్చిందా లేదా ఎవరు ఈ విషయం మీడియాకు అందించారని ఆరా తీయడం విశేషం. కార్మిక శాఖలోని కొందరు మాత్రం తాము పరిధి దాటి చేసిన పనిని కప్పి పుచ్చేందుకు విశేషంగా ప్రయత్నాలు చేయడం కార్మిక శాఖలో చర్చనీయాంశంగా మారింది. చేసిన తప్పిదాలను బయటకు పొక్కకుండా, పైకి గంభీరంగా ఉంటూనే శతవిధాలా ఈ విషయం బయటకు పొక్కిన విధానం పై ఆరా తీస్తూనే.. తమను ఎవరూ ఏమి చెయ్యలేరాని బేరాలకు పోయినట్టు కార్మిక శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి ఏడాది మార్చి నెలలో జరిగే కార్మికుల లైసెన్స్ రెన్యూవల్ వ్యవహారం జరుగడంతో ప్రతి సంవత్సరం మాముళ్లు మాములే అనే చర్చ జరగుతుంది.

కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ లో చోటు చేసుకుని బహిర్గతమైన కాసుల వసూళ్ల వ్యవహరంపై స్పందించేందుకు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ నిరాకరించారు. జిల్లా కలెక్టర్ విచారణ జరుగుతుందని జవాబు ఇచ్చారు. తాను కొత్తగా వచ్చాను అని దాటవేసే యత్నం చేశారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో జారీ చేసే కొత్త లైసెన్స్ లు, రెన్యూవల్ వ్యవహారాలు తెలియదనడం గమనార్హం. ఆర్మూర్ డివిజన్ పరిధిలో సిడ్ ప్రాసెస్ ప్లాంట్ లలో కాసుల వసూళ్ల వ్యవహారం తెలియదని చెబుతున్న అధికారులు... ఆర్మూర్ డివిజన్ లో పని చేసే జూనియర్ అసిస్టెంట్ ను రప్పించి, ఎందుకు వివరాలు తెలుసుకున్నారు అనేది ఎవరు ఊహించడం లేదు. ఆర్మూర్ డివిజన్ లేబర్ ఆఫీసర్ ను కాదని అక్కడ లైసెన్స్ ల రెన్యూవల్ వ్యవహారాన్ని తనిఖీ చేయడం వెనుక మతలాబు ఏమిటి అనేది, ఎవ్వరు స్పందించక పోవడం అంత గప్ చుప్ గా వ్యవహరించడంపై విమర్శలు ఉన్నాయి. సంబంధిత సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ యజమానికి రాయబారాలకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఎక్కడ అధికారుల విచారణలో తమ పేర్లు బయటపడుతాయో అని కార్మిక శాఖలోని పలువురు అధికారులకు భయం పట్టుకుంది.



Next Story

Most Viewed