ఏర్పాట్లు పూర్తి.. రెండ్రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

by Disha Web Desk 2 |
ఏర్పాట్లు పూర్తి.. రెండ్రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
X

దిశ, ధర్మపురి: ప్రసిద్ధి చెందిన నవనృసింహ క్షేత్రాలో గోదావరి తీరాన వెలసిన ప్రాచీణ పుణ్యక్షేత్రమైన ధర్మపురి ఒకటి. ఈ ధర్మపురి బ్రహ్మోత్సవాలు ఈనెల 14వ తేదీనుండి 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి దేవాలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.


క్షేత్ర మహత్యం..

ఈ క్షేత్రం కాకతీయులకు పూర్వం నుండి ఉన్న దివ్య క్షేత్రం. జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం తెలంగాణ రాష్ర్టంలోనే చాలా పవిత్రమైన ప్రాచీణ పుణ్య క్షేత్రం. ధర్మపురి క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రాన్ని ధర్మవర్మ అనే మహారాజు నిర్మించాడని సమాచారం.

క్షేత్రంలో చూడవల్సిన ప్రదేశాలు..

ధర్మపురి క్షేత్రంలో నరసింహ స్వామి(యోగ,ఉగ్ర)తో పాటు వెంకటేశ్వర స్వామి, వేణు గోపాల స్వామి, ఆంజనేయ స్వామి, రామలింగేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబ, రామ మందిరాలతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా యమ ధర్మరాజు, బ్రహ్మ దేవుని దేవాలయాలు కూడా ఉన్నాయి. రాష్ర్టంలోనే అతిపెద్ద బ్రహ్మపుష్కర్ణి ( కోనేరు) ఇక్కడ ఉంది.

నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి వసతి, చలువ పందిళ్ళు, షవర్లు, ప్రత్యేక మరుగు దొడ్లు, విద్యుత్ దీపాలు, టీటీడీ ధర్మశాలలో రోజూ ఉచిత భోజన తదితర ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు.

Next Story