మూడెకరాల తరహాలోనే దళిత బంధు కావద్దు : ఎమ్మెల్యే సీతక్క

by Disha Web Desk |
మూడెకరాల తరహాలోనే దళిత బంధు కావద్దు : ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని దళితులకు ఇప్పటికే అన్యాయం చేశారని, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి, అసైన్డ్​ ల్యాండ్​ను లాక్కుంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. శాసనసభలో సంక్షమ పద్దులపై చర్చ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు చాలాచోట్ల పలు పనులు, కార్యాలయాల కోసం దళితులకు గతంలో ఇచ్చిన భూములను లాక్కున్నారన్నారు. ఇప్పుడు దళిత బంధు కోసం బడ్జెట్​లో నిధులు కేటాయించారని, మూడెకరాల పథకం వాయిదా వేసినట్లు దళిత బంధును ఆలస్యం చేయవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు వర్తింప చేయాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని, గతంలో రాత్రి వేళల్లో గ్రామాలకు వెళ్లాలంటూ భయం ఉండేదని, కానీ ఇప్పుడు ఉదయం కూడా భయపడాల్సి వస్తుందన్నారు. నిత్యం మద్యం దొరుకుతుందని, కనీసం గ్రామాల్లోనైనా సాయంత్రం వేళల్లో మద్యం అమ్మకాలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేవని ఈ సందర్భంగా సీతక్క సభకు వెల్లడించారు.



Next Story

Most Viewed