WhatsApp నుంచి రాబోయే కొత్త ఫీచర్లు

by Web Desk |
WhatsApp నుంచి రాబోయే కొత్త ఫీచర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొన్ని కొత్త ఫీచర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని ఫీచర్స్ టెస్టింగ్ స్టేజిలో ఉన్నాయి. వాట్సాప్ బీటా ప్రోగ్రామ్‌లో ఉన్న వినియోగదారులకు ఈ ఫీచర్లలో కొన్ని ఇప్పటికే రోల్ డౌట్ చేయబడుతున్నాయి.

WhatsApp కొత్త ఫీచర్లు

WhatsApp వెబ్/డెస్క్‌టాప్ కోసం రెండు దశల వెరిఫికేషన్

వాట్సాప్ తన డెస్క్‌టాప్, వెబ్ వినియోగదారుల కోసం రెండు-దశల వెరిఫికేషన్ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని వలన వినియోగదారుల WhatsApp ఖాతాకు అనధికారిక యాక్సెస్‌ను నిరోధించవచ్చు. WhatsApp ఖాతాకు లాగిన్ అయినప్పుడు రెండు-దశల ధృవీకరణ పిన్ అవసరం అవుతుంది. ఇది ప్రస్తుతం WhatsApp మొబైల్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

కొత్త యానిమేటెడ్ ఎమోజీలు

ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త యానిమేటింగ్ ఎమోజీలను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం, యాప్ దాని వినియోగదారుల కోసం ఒకే యానిమేటెడ్ రెడ్ కలర్ హార్ట్ ఎమోజీని మాత్రమే అందిస్తుంది. కొత్తగా యానిమేటెడ్ ఎఫెక్ట్‌ను మరిన్ని ఎమోజీలకు ప్రవేశపెట్టడానికి పనిచేస్తోంది.

WhatsApp మెసేజ్ రియాక్షన్

WhatsApp వినియోగదారులు త్వరలో Instagram, Facebook Messenger వంటి మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను పొందుతారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్‌లు మెసేజ్‌కు రిప్లై ఇవ్వడానికి ఎమోజీ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. దీనితో, గ్రూప్‌లో ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ మెసేజ్‌లకు ఎవరు రియాక్ట్ అయ్యారో యూజర్‌లు చూడగలరు.

WhatsApp కమ్యూనిటీ ఫీచర్

వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌ల కోసం కొత్త కమ్యూనిటీస్ ఫీచర్‌ను పరిచయం చేస్తుంది. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌లకు మరింత నియంత్రణను అందిస్తుంది. ఈ ఫీచర్‌తో, అడ్మిన్‌లు గ్రూప్‌లలో గ్రూప్‌లను క్రియేట్ చేయవచ్చు. సబ్-గ్రూప్‌లు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి.

గ్రూప్ అడ్మిన్‌ల కోసం కొత్త చాట్ ఫీచర్

గ్రూప్ అడ్మిన్‌ల కోసం వాట్సాప్ గ్రూప్ సభ్యులు పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసే ఫీచర్‌ను అందిస్తుంది. రాబోయే ఈ ఫీచర్‌తో, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు ఎవరి మెసేజ్ అయిన వారి అనుమతి అవసరం లేకుండానే తొలగించగలరు. అడ్మిన్ గ్రూప్ చాట్‌లో మెసేజ్‌ను డిలీట్ చేసినప్పుడు, వినియోగదారులు 'ఇది అడ్మిన్ ద్వారా తొలగించబడింది' అని చెప్పే నోటిఫికేషన్‌ను పొందుతారు.

WhatsApp స్టేటస్

వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ స్టేటస్‌ని ఎవరు చూడవచ్చో మేనేజ్ చేసుకోవచ్చు. ఇది సెక్యూరిటీ పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ద్వారా స్టేటస్‌ను ఎవరు చూడవచ్చొ, ఎవరు చూడరాదొ ఎంచుకోవచ్చు.

చాట్, స్టేటస్‌లో ఒకే ఫొటో/వీడియోను షేర్ చేయడం

ఇది వినియోగదారులు మీడియాను వారి WhatApp స్టేటస్‌ను, వ్యక్తిగత చాట్‌లు ఒకే విండోలో చూడటానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌తో, వినియోగదారులు ఒకే సమయంలో చాట్, స్టేటస్‌లో మీడియాను పంచుకోగలరు.

ఫొటోలు, వీడియోల ప్రివ్యూ

వాట్సాప్ చాట్‌లలో షేర్ చేసిన డాక్యుమెంట్‌ల కోసం కొత్త ప్రివ్యూను ప్రారంభించాలని WhatsApp యోచిస్తోంది. కొత్త ఫీచర్‌తో, వినియోగదారులు చాట్‌లలో డాక్యుమెంట్‌లుగా షేర్ చేయబడిన వీడియోలు, ఫొటోలను ప్రివ్యూ చేయగలుగుతారు.



Next Story