'యా-మహా ఫైన్ లగేగా'.. వినూత్న రీతిలో ముంబై పోలీసుల హెచ్చరిక!

by Disha Web Desk 12 |
యా-మహా ఫైన్ లగేగా.. వినూత్న రీతిలో ముంబై పోలీసుల హెచ్చరిక!
X

దిశ, ఫీచర్స్ : రోడ్డు భద్రత, సైబర్ సేఫ్టీ, కరోనా రూల్స్‌ వంటి అంశాలపై అవగాహన కల్పించడంలో ముంబై పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఆయా జాగ్రత్తల ప్రచారానికి సోషల్ మీడియాను యూజ్ చేస్తుంటారు. సినిమాల ఫస్ట్ లుక్, ఎపిక్ డైలాగ్స్, ఫేమస్ సాంగ్స్‌ సహా పజిల్స్‌‌ను కూడా ఇందు కోసం‌ వాడేస్తుంటారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ నిబంధనలపై అవేర్‌‌నెస్ కల్పించేందుకు టూవీలర్ బ్రాండ్ నేమ్స్ ఉపయోగించుకున్న పోలీసులు 'యా-మహా ఫైన్ లగేగా' అంటూ వినూత్న రీతిలో హెచ్చరిస్తున్నారు.

యువతను, బైక్స్‌ను వేరుచేసి చూడలేమంటే అతిశయోక్తి కాదేమో. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్లే యువతరానికి కళ్లెం వేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పనిసరి. లేదంటే వారిని నియంత్రించలేం. ఈ మేరకు మితిమీరిన వేగంతో వెళ్తూ సంయమనం పాటించని వాహనదారులను హెచ్చరించేందుకు 'రాయల్ ఎన్‌ఫీల్డ్, డుకాటి, హోండా' కంపెనీలకు చెందిన బైక్స్ నేమ్స్‌తో కొన్ని చమత్కారమైన ట్వీట్స్ షేర్ చేశారు.

* 'హీరో డోంట్ అన్‌నెసెస్సర్లీ హార్న్-డా'(అనవసరంగా హార్న్ కొట్టవద్దు) అంటూ హీరో కంపెనీ పేరున ఓ గ్రాఫిక్ కార్డ్ షేర్ చేశారు.

* 'రాయల్స్ ఆన్ ఫీల్డ్, వేర్ యువర్ క్రోన్'(యుద్ధభూమిలో ఉన్న వీరులారా మీ కిరీటాన్ని ధరించండి) అంటూ ప్రస్తావించిన ప్రముఖ బైక్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌.. హెల్మెట్ ధరించాల్సిగా సూచించింది.

* 'డు-కట్టి విత్ స్పీడ్' అంటూ ఓవర్ స్పీడ్‌కు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు.

* రోడ్డు మీద వెళ్తూ యూ-టర్న్ లేదా మలుపు తీసుకునేటప్పుడు ఇండికేటర్ ఉపయోగించాలనే విషయాన్ని చెప్పేందుకు ఐకానిక్ హోండా డియో స్కూటర్‌ బ్రాండ్‌‌ను ఉపయోగించుకున్నారు. ఈ మేరకు 'వైల్ టర్నింగ్ రైట్ ఇండికేటర్ డియో' అని రాశారు.

ఇక బాలీవుడ్‌ రీసెంట్ హిట్ 'గెహ్రాయియా'లోని పాటను కూడా వాడుకున్న ముంబై పోలీసులు.. 'హాన్ డూబే, హాన్ డూబే, హాన్ డూబే : మీరు మీ OTP ని షేర్ చేసిన తర్వాత మీ డబ్బు జాగ్రత్త. సైబర్ నేరాల పట్ల సురక్షితంగా ఉండండి' అంటూ సైబర్ సేఫ్టీ‌పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు.



Next Story

Most Viewed