చేయి తడిపితేనే పర్మిషన్.. సెక్రటరీ పనితీరుపై ఎంపీడీఓ ఫైర్

by Dishafeatures2 |
చేయి తడిపితేనే పర్మిషన్.. సెక్రటరీ పనితీరుపై ఎంపీడీఓ ఫైర్
X

దిశ, పిట్లం : ఇల్లు కట్టాలంటే చేయి తడపాల్సిందే. ఇంటి పర్మిషన్ కొరకు గ్రామ పంచాయతీకి వెళ్తే అధికారులు డబ్బులు డిమాండ్ చేశారని లబ్ధిదారులు చిలువేరు గంగారాం తెలిపారు. పిట్లం మండలంలోని తిమ్మా నగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న తీరును చూసి లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామ పంచాయతీలో ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్‌కు వెళితే రెండు నెలలు కావస్తున్నా కూడా ఇంటి పర్మిషన్ ఇవ్వడం లేదని వారు తెలిపారు. తిమ్మానగర్ సెక్రటరీ శ్రీజ రెడ్డి ఇంటి పర్మిషన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఎంపీపీ కవితా విజయ్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు గ్రామపంచాయతీ ఆకస్మిక తనిఖీ చేయగా పలు విషయాలు బట్టబయలయ్యాయి. ఎంపీడీవో రికార్డులను పరిశీలించగా ఫిబ్రవరి మొదటి వారం నుండి ఇప్పటివరకు ఒక్క సంతకం కూడా చేయక పోవడంతో ఆయన ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రికార్డులు తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు.సుమారు ఎనిమిది మంది లబ్ధిదారులు ఇల్లు నిర్మాణం కోసం దరఖాస్తు చేయగా ఇప్పటివరకు వాళ్లకు పర్మిషన్ ఇవ్వకపోవటం శోచనీయం. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని నిధులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు ఎంపీడీవో దృష్టికి తీసుకువచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్‌లో కొడుకు ఇచ్చినప్పటికీ కార్యదర్శి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డబ్బులు డిమాండ్ చేసిందని లబ్ధిదారులు చెపుతారు. ఈ తనిఖీల్లో భాగంగా సర్పంచ్ కవిత పండరి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీవో శివకుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది చంద్రశేఖర్, లబ్ధిదారులు ఉన్నారు.



Next Story

Most Viewed