ఇందిరాగాంధీపై మంత్రి నిరంజన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఆమె నిర్ణయాలే దానికి కారణమంటూ..

by Disha Web Desk 19 |
ఇందిరాగాంధీపై మంత్రి నిరంజన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఆమె నిర్ణయాలే దానికి కారణమంటూ..
X

దిశ, వనపర్తి: ప్రజాస్వామ్యంలో అహంకారంతో విర్రవీగితే ప్రజలే ప్రతిపక్ష పాత్రను పోషించి సమయంవచ్చినప్పుడు నేలకేసి కొడతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రాలను కోరుకుంటారు. ప్రజల మనోభావాలను కాపాడితే పూల బుట్టలో పెట్టుకుని భుజాలపై మోస్తారు.. లేదంటే నేలకేసి విసిరి కొడతారని చెప్పారు.


కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్నారు.. టీమ్ స్పిరిట్‌తో కాకుండా కేవలం హోదాలో ఉన్న ఒకరిద్దరు వ్యక్తుల నిర్ణయాలతో పాలన సాగుతుందన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయాలను తీసుకొని రాష్ట్రాలపై నెడుతూ అహంకార పూరితంగా వ్యవహరిస్తుందని చెప్పారు. 1975లో అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ సైతం ఇదే విధంగా అహంకారంతో వ్యవహరించి ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసి తనకు తిరుగులేదని భావించింది అన్నారు. ప్రభుత్వపరంగా ఆమె తీసుకున్న నిర్ణయాలు ఎమర్జెన్సీ అమలు చేశాయన్నారు. కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే ప్రతిపక్ష పార్టీలు లేకపోయినా ప్రజలే ప్రతిపక్ష పార్టీల పాత్రను పోషించి ఎన్నికలలో ఓడించారన్నారు. అనామకులు ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యారని మంత్రి చెప్పారు.

ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు లేకున్నా ప్రజలే ఎన్నికలలో అనామకులను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మంత్రి గుర్తు చేశారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మెచ్చేలా అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అనంతరం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు రాములు, జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ తదితర స్థానిక నేతలతో కలిసి మహిళా బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, గొర్రెల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed