యజమాని ఇంటికి కన్నం వేసిన పనిమనిషి

by Disha Web Desk 23 |
యజమాని ఇంటికి కన్నం వేసిన పనిమనిషి
X

దిశ,హన్మకొండ : పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే ప్రియుడు, అక్కతో కలిసి చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను హన్మకొండ సుబేదారి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు 38 లక్షల విలువ గల నాలుగు వందల డబ్భై గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను మీడియాకు వెల్లడించారు. కత్రి కళ్యాణి @ కళ, హన్మకొండ లోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటున్న డాక్టర్ కీసర ఇంద్రారెడ్డిలో ఇంటి గత కొద్ది కాలంగా పనిమనిషి గా పనిచేస్తుంది. ఇదే సమయంలో నిందితురాలు తన యజమాని ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను ఉన్నట్లుగా గుర్తించిన నిందితురాలు తన యజమాని ఇంట్లో బంగారాన్ని చోరీ చేయడం ద్వారా సులభం డబ్బుతో సంపాదించడం తో జల్సా జీవితాన్ని గాడపాలానే ఆశ కలిగింది.

దీంతో నిందితురాలు గత ఫిబ్రవరి నెల లో మిగతా నిందితురాలైన తన ప్రియుడు చంటి, అక్క సునీత తో కలిసి యజమాని ఇంటిలోని సుమారు 650 గ్రాముల బంగారు ఆభరణాలను నాలుగు దఫాలుగా చోరి చేసింది. చోరీ చేసిన బంగారాన్ని నిందితులు అమ్మి ఒక కారును కొనుగోలు చేశారు. ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ అయినట్లుగా ఇంటి యజమాని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిందితులను గుర్తించారు. శుక్రవారం ఉదయం సుబేదారి ఇన్స్ స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఫారెస్ట్ కార్యాలయం ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానస్పదంగా వస్తున్న కారును పోలీసులు తనిఖీ చేయగా కారులో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. డాక్టర్ ఇంట్లో చోరీకి పాల్పడిన విషయాన్ని అంగీకరించారు.నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన వారిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ డీసీపీ అబ్దుల్ బారి, హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, సుబేదారి ఇన్స్ స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐలతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.



Next Story

Most Viewed