మూడు రాజధానులను ఖచ్చితంగా నిర్మించి తీరుతాం: మంత్రి కొడాలి నాని

by Web Desk |
Minister Kodali Nani
X

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నూరైనా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతామని చెప్పుకొచ్చారు. ప్రజల ఆమోదం తో మూడు రాజధానులు నిర్మించి తీరుతామని చెప్పుకొచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన ఎంత అవసరమో రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణ అంతే అవసరమని చెప్పుకొచ్చారు.

మూడు రాజధానుల బిల్లు గతంలోనే పాస్ అవ్వాల్సి ఉందని అయితే శాసన మండలిలో టీడీపీ బలం ఉండటంతో ఈ బిల్లులను టీడీపీ నిలిపివేసింది గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులను ప్రజలు అంగీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ దెబ్బ తింటుందోనన్న ఆందోళనతోనే మూడు రాజధానులను అడ్డుకుంటుందని మంత్రి కొడాలి నాని విమర్శించారు.



Next Story

Most Viewed