నిరుద్యోగులకు శుభవార్త.. 38 ఉచిత శిక్షణ కేంద్రాలు..

by Dishafeatures2 |
నిరుద్యోగులకు శుభవార్త.. 38 ఉచిత శిక్షణ కేంద్రాలు..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్రంలో జరగనున్న ఉద్యోగ నియామకాలకు సంబంధించి గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది వేల మందికి పైగా నిరుద్యోగ గిరిజన యువత ఉన్నారని గుర్తించి వారికి ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అంశాలపై ఉచిత శిక్షణ ఇవ్వడానికి 38 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణలు ఇవ్వనున్నట్లుగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ.. శిక్షణ కేంద్రాలు ప్రారంభమవుతాయని, శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఆయా జిల్లా కలెక్టర్లు తేదీలను ప్రకటిస్తారని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లేఖ రాయడం జరిగిందని, అందుకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed