Mahesh Babu: బిల్ గేట్స్‌తో మహేష్ బాబు బిజినెస్ డీల్?

by Disha Web |
Mahesh babu and Namrata meet Bill Gates on their New York trip
X

దిశ, సినిమా : Mahesh babu and Namrata meet Bill Gates on their New York trip| సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వెకేషన్‌లో వారు గడుపుతున్న ప్రతీ ఒక్క హ్యాపీ మూమెంట్‌ను సోషల్ మీడియా ద్యారా షేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట్ వైరల్‌గా మారాయి. విషయానికొస్తే.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌‌ను మహేష్‌ బాబు రీసెంట్‌గా మీట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన పిక్స్‌లో బిల్ గేట్స్‌తో మహేష్, అతని వైఫ్ నమ్రతను కూడా చూడవచ్చు.

ప్రస్తుతం ఇదే పిక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన మహేష్.. 'మిస్టర్@ బిల్ గేట్స్‌ను కలవడం ఆనందంగా ఉంది! ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. ఇంకా చెప్పాలంటే అత్యంత వినయస్థుడు! నిజమైన ఇన్‌స్పిరేషన్!!' అంటూ పోస్ట్ చేశారు ప్రిన్స్. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు.. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరితో కలిసి తమ అభిమాన నటుడిని చూసి ఉప్పొంగి పోతున్నారు. కాగా ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


Next Story